ఆగస్ట్, 2009ను భద్రపఱచు

ఆనందం …

రాలే ఆకులు పూచే పూవులు వీచే గాలులు…తనువుని గాక మనసుని తాకాలని ఉంది…మనసు రెక్కలు విప్పిఆకాశంలో విహరించాలని ఉంది…సెల్ ఫోన్లు మనీ పరుసులూ విసిరి పారేసి…వానలో తనివితీర తడవాలని ఉంది…ఆకాశం అంచులు తాకేలా…మోడు వారిన మనసులు తడిచేలా…నా ఆనందం వెద జల్లాలని ఉంది…

ప్రకటనలు

ఇక్కడే – ఇప్పుడే

విశ్వం అనంతమైతేఅదెక్కడున్నాఎప్పటికీ ఉన్నట్లేఐతే…నువ్వెక్కడున్నాఎప్పటికీ ఉన్నట్లేవిశ్వంలా ఎప్పటికీ ఉండే నువ్వుఇక్కడ – ఇప్పుడు ఉన్నట్లేఅందుకే… నువ్వెవరైనా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికిఇంతకన్నా మంచి సమయం మరొకటి లేదు.

చిన్ని చిన్ని ఆశ

పైరగాలి పాట వింటూ పరవశించిపోవాలని చేనుగట్ల మీద పరుగెడుతూ తూనీగలతో ఆటలాడాలని కల్మషంలేని పసిమనసులతో కలిసి సల్లాపాలాడాలని అలుపెరుగని ఆటల సంద్రంలో మునిగితేలాలని ఆకాశమే హద్దుగా ఎగిరిపోయే చిట్టిగువ్వనవ్వాలని హద్దేలేని ఊహల ఊయలలో ఊగిసలాడాలని మరపురాని మధురానుభూతుల్ని మళ్ళీ అనుభవించాలని……………

నా ఆశ!

నీ ఆశల హరివిల్లు లోని ప్రతి రంగుని నేనై వెలిగిపోవాలని… నీ కలల పుస్తకపు ప్రతి పేజిలో ఒక చెరిగిపోని సంతకం నేనై మిగిలిపోవాలని… అందమైన నీ ఊహల చిరుజల్లులో ప్రతి చినుకుని నేనై మురిసిపోవాలని… నీ మాటల పూదోటలో విరిబాలనై వికసించాలని… నీ ఆలోచనా ప్రవాహంలో ఎగసిపడే ప్రతీ అలని నేనైపోవాలని…. అశయసాధనలో నువ్వు వేసే ప్రతి అడుగుని నేనై… గెలుపు కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నపు …