నా కోరికలు

నేనో విహంగమై విను వీధుల విహరించాలి…ప్రకృతి కాంత పరువాలు వొకపరి పరికించాలి…మబ్బులతో మాటాడాలి…మామ చంద్రునికో ముద్దు పెట్టాలి…హిమగిరి పర్వతాలు ఎక్కి ఆడాలి..కాశ్మీరమంతా కనులారా వీక్షించాలి…ప్రపంచ శాంతి కపోతమై జీవించాలి…

ప్రకటనలు

కల

నీ రాకను తెలుసుకున్న కొంటె గాలి మల్లె తీగను గిల్లుతూ వీచెను ఆ మల్లె తీగ ఓరగా వాలి తన పూలను నవ్వుతూ రాల్చెను వెచ్చని నీ పాద స్పర్శతో తుళ్ళుతూ ఆ పూలు చివరి క్షణాన్ని ఆస్వాదించెను నిన్ను తాకే సూర్య కిరణాలను చూసి ఈర్షపడిన మేఘమాల సూర్యున్ని అడ్డగించి కురిపించెను చిరుజల్లు నీ తడి మోము చూచి చిన్నబోయెను హరివిల్లు ఇదంతా చూసిన నేను నవ్వుతూ నిద్రలేచాను

నే వెళ్లిపోతాను

నే వెళ్లిపోతాను,చీకటి కప్పిన ఈ లోకాన్నీ, ఈ చీకటినీవిదిలించుకుని, విశాలమైన ఆ వినీల గగానానికి,నే వెళ్లిపోతానుఆలోచనలకు, ఆనందానికి చోటునిచ్చేఆ అనంత దూరాలకు,నే వెళ్లిపోతాను,మనుషులకే కాదు, మనసులకు కూడాచోటు లేని ఈ ఇరుకైన లోకాన్ని వదిలి,నే వెళ్లిపోతాను,కవనానికి, కలలకూకావలసినంత చోటిచ్చే ఆ ఊహా లోకానికి…

నా కలలు

కలల అలల మధ్య తేలుతూ .. కమ్మని ఊహల్లో విహరిస్తూ… కష్టాల సుడిగుండాలను దాటుతూ.. ఆనందపు ఉప్పెనలను అనుభవిస్తూ…

ఎక్కడికో…

ఇవాళైనా ఏమైనా చెప్తావనిప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చినిల్చుంటాను మలుపులు తిరుగుతూ ఏ మార్మికతల్లోకోమౌనంగా వెళ్ళిపోతావు కదిలే ప్రవాహంలో కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా “నేను” మిగిలిపోతాను!

“తీరని కోర్కెలు”

ఆకాశంలో మిల మిల మెరిసే తారకలాగా తళుక్కున మెరవాలని ఉంది!చందమామనై చల్లని కాంతులు వెదజల్లాలని ఉంది!!లోకబాంధవుడు సూర్యుడిలా లోకాలన్నీ యేలాలని ఉంది!శ్రావణ మేఘపు జల్లుగ కురిసి పుడమి తల్లిని తడపాలని ఉంది!!వసంత మాసాన ప్రకృతినై పులకించాలని ఉంది!ఎల కోయిలనై కుహు కుహు మని కూయాలని ఉంది!!అందాలొలికే గులాబి బాలగ వికసించాలని ఉంది!ఝుమ్మని ఎగిరే తుమ్మెదనై అందలి మకరందం గ్రోలాలని […]