ఆనందం …

రాలే ఆకులు పూచే పూవులు వీచే గాలులు…తనువుని గాక మనసుని తాకాలని ఉంది…మనసు రెక్కలు విప్పిఆకాశంలో విహరించాలని ఉంది…సెల్ ఫోన్లు మనీ పరుసులూ విసిరి పారేసి…వానలో తనివితీర తడవాలని ఉంది…ఆకాశం అంచులు తాకేలా…మోడు వారిన మనసులు తడిచేలా…నా ఆనందం వెద జల్లాలని ఉంది…

ప్రకటనలు

ఇక్కడే – ఇప్పుడే

విశ్వం అనంతమైతేఅదెక్కడున్నాఎప్పటికీ ఉన్నట్లేఐతే…నువ్వెక్కడున్నాఎప్పటికీ ఉన్నట్లేవిశ్వంలా ఎప్పటికీ ఉండే నువ్వుఇక్కడ – ఇప్పుడు ఉన్నట్లేఅందుకే… నువ్వెవరైనా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికిఇంతకన్నా మంచి సమయం మరొకటి లేదు.

చిన్ని చిన్ని ఆశ

పైరగాలి పాట వింటూ పరవశించిపోవాలని చేనుగట్ల మీద పరుగెడుతూ తూనీగలతో ఆటలాడాలని కల్మషంలేని పసిమనసులతో కలిసి సల్లాపాలాడాలని అలుపెరుగని ఆటల సంద్రంలో మునిగితేలాలని ఆకాశమే హద్దుగా ఎగిరిపోయే చిట్టిగువ్వనవ్వాలని హద్దేలేని ఊహల ఊయలలో ఊగిసలాడాలని మరపురాని మధురానుభూతుల్ని మళ్ళీ అనుభవించాలని……………

నా ఆశ!

నీ ఆశల హరివిల్లు లోని ప్రతి రంగుని నేనై వెలిగిపోవాలని… నీ కలల పుస్తకపు ప్రతి పేజిలో ఒక చెరిగిపోని సంతకం నేనై మిగిలిపోవాలని… అందమైన నీ ఊహల చిరుజల్లులో ప్రతి చినుకుని నేనై మురిసిపోవాలని… నీ మాటల పూదోటలో విరిబాలనై వికసించాలని… నీ ఆలోచనా ప్రవాహంలో ఎగసిపడే ప్రతీ అలని నేనైపోవాలని…. అశయసాధనలో నువ్వు వేసే ప్రతి అడుగుని నేనై… గెలుపు కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నపు …

ఒంటరితనం

నీతో నువ్వు నీలో నువ్వు నీకై నువ్వు నీలా నువ్వు ఉంటే ఒంటరితనమేలాఅందరితో నువ్వున్నా నీకై ఎవరూ లేక పోవటం ఒంటరితనం నాకెవ్వరు అవసరం లేదనుకుంటే అహంకారంనీకెవ్వరు లేరనుకోవటం అంధకారం

జీవితం

కళ్ళు తెరచి చూసే సరికినేనో సమూహంలో నడుస్తూ ఉన్నాను.ఇరుకైన బాట గుండా ప్రయాణం బాగానే సాగుతుంది.కనుచూపు మేరలో బాట పొడవునా జనమే.నా వెనుక సమూహం కొద్దికొద్దిగా పెరుగుతూ పోతోంది.ముందూ వెనుకా నాలానే చాలామందికబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.అలాగని పెద్ద కష్టంగా ఏమీ లేదు.నలుగురి మధ్యలో నడక ఆట్టేఅలసట అనిపించటం లేదు.ఇంతలో ఒక సందేహం కలిగింది.నా ముందాయన్ని అడిగాను”ఈ బాట […]

వీడిపోతా

జంట వీడిన రెప్పలేలోకాన్ని నాకు చూపుతున్నాయి.మౌనం వీడిన మాటలేమధురాన్ని నాకు పంచుతున్నాయి.కలలు వీడిన మనసేలక్ష్యాన్ని నాకు చేర్చింది.గూడును వీడిన గువ్వేనింగి స్వేచ్చను కనుగొంది.తనువు వీడిన ప్రాణమేస్వర్గాన విహారానికి వెళ్ళింది.వీడి పోవడం కూడాచెర నుండి విడుదలే అయితేనాకదే కావాలి. ఎప్పటికీ ప్రశ్నలాంటి నిన్నువీడి వెళ్తాను నేను.నిన్ను వీడి అయినానన్ను నేను […]